అతిలోక సుందరి.. తరాలు మారినా చెదరని సౌందర్యం

1
కాలం మారింది…తరాలు మారాయి… కానీ…రోజులెన్ని మారినా ఏళ్లు ఎన్ని గడిచినా మనం మరిచిపోలేని మనుషులు కొందరుంటారు. అలాంటి వారే అతిలోక సుందరి శ్రీదేవి… చిరకాలం గుర్తుండిపోయే అందాల నటి శ్రీదేవి ఇక లేరు. అతిలోక సుందరి అస్తమయమైంది. భువి నుంచి దివికెగిసింది. లెజండరీ నటి….అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయారు. దుబాయ్ లో నటుడు మోహిత్ మార్వా వివాహానికి భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు శ్రీదేవి. బాలనటిగా 1967లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ సినిమాల్లో నటించారు.

శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగేరి అయ్యపాన్. 1975లోని తన చిన్నతనంలో తునాయివన్  సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిన శ్రీదేవి…భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో మా నాన్న నిర్దోషి మూవీతో ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి.. అగ్రహీరోలందరితోనూ నటించారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72 మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు శ్రీదేవి.

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను 1996లో పెళ్లి చేసుకుంది శ్రీదేవి. వీరికి జాన్వీ, ఖుషీ ఇద్దరు కుమార్తెలున్నారు. ఇప్పటి వరకూ 15 ఫిల్మ్ ఫేర్ అవార్డుల అందుకున్న శ్రీదేవిని 2013లో భారత సర్కార్ పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అంతే కాదు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే జుదాయి మూవీ తర్వాతా వెండితెరకు దూరమైన శ్రీదేవి..మళ్లీ  14 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్-వింగ్లీష్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. చివరిగా ఆమె 2017లో మామ్ లో నటించారు. శ్రీదేవి మృతిపై బాలీవుడ్ తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగులో మూడు తరాల హీరోలతో నటించిన ఘనత శ్రీదేవి సొంతం. ఫస్ట్ జనరేషన్ హీరోలైనా ఎన్టీఆర్, ఎన్నాఆర్ ల సరసన యాక్ట్ చేసి మెప్పించిన శ్రీదేవి….ఇక రెండో తరం హీరోలైనా కృష్ణ, శోభన్ బాబులతో సైతం ఆడిపాడింది. మూడో తరం కథానాయకులైనా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో జోడి కట్టి తన సత్తా చాటింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే శ్రీదేవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హిమ్మత్ వాలా సినిమా శ్రీదేవిని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత హిందీ చిత్ర సీమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఆలిండియా నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

 

Posted in Uncategorized

Latest Updates