అతి తక్కువ సర్వీస్‌‌‌‌ చార్జీలు మావే : ఎస్‌‌‌‌బీఐ ఎండీ పీకే గుప్తా

ఢిల్లీ : బ్యాంకింగ్‌‌‌‌ పరిశ్రమలోనే అతి తక్కువ సర్వీస్‌‌‌‌ చార్జీలు వసూలు చేస్తు న్నది తామేనని స్టేట్‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఎస్‌‌‌‌బీఐ) మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్‌ పీకే గుప్తా చెప్పారు. ఏటిఎం లావాదేవీలు, నగదు డిపాజిట్లకు కొంత సర్వీస్‌‌‌‌ చార్జీ వుందని, ఐతే ఆ చార్జీలు కూడా చాలా తక్కువని తెలిపారు. కస్టమర్ల  ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తక్కువ చార్జీలు విధిస్తున్నామన్నారు గుప్తా. నెలవారీ కనీస నిల్వలు (మినిమం ఎకౌంట్‌ బ్యాలెన్స్) మెంటెయిన్‌ చేయకపోతే విధించే చార్జీల గురించి ప్రస్తావిస్తూ, టెక్నాలజీ అప్‌ గ్రేడ్‌ చేసేందుకు బ్యాంకు భారీగా పెట్టుబడులు పెట్టిందని, సెక్యూర్‌ బ్యాంకింగ్‌‌‌‌కు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఏటిఎంలు, క్యాష్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని, దానికి కూడా భారీగా నిధులు వెచ్చించామన్నారు పీకే గుప్తా. ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ మీద పెట్టిన భారీ పెట్టుబడులలో కొంతైనా మొత్తాన్ని స్వల్ప సర్వీస్‌‌‌‌ చార్జీల ద్వారా తీసుకోవడం తప్పదని గుప్తా వివరించారు. మధ్యలో కొంత కాలం నిలిపి వేసినా, ఏప్రిల్‌‌‌‌ 2017 నుంచి మళ్లీ నెలవారీ కనీస నిల్వలు లేకపోతే చార్జీలను విధిస్తున్నామన్నారు. కిందటేడాది అక్టోబర్‌ లోనూ, ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో ఒకసారి ఆ చార్జీలను తగ్గిం చామని గుర్తు చేశారు. ప్రైవేటు రంగ బ్యాం కులతో పోలిస్తే తమ సర్వీస్‌‌‌‌ చార్జీలు చాలా తక్కువన్నారు. సేవింగ్స్‌ బ్యాంక్‌‌‌‌ ఎకౌంట్‌ ఖాతాదారులలో 60 శాతం మందికి ఈ చార్జీల నుంచి మినహాయింపు పొందుతున్నారని, నో- ఫ్రిల్స్‌ ఎకౌంట్‌ లు, స్టూడెంట్లు , మైనర్లకు ఈ చార్జీలు లేవని తెలిపారు. కస్టమర్లకు నెలవారీ 5 ఏటిఎం లావాదేవీలు, బ్రాంచీలలో రెం డు సార్లు నగదు విత్‌ డ్రాయల్స్‌ ను ఉచితంగానే అందిస్తున్నట్లు చెప్పా రు. ఇక డిజిటల్ లావాదేవీల నిర్వహణకు కస్టమర్లకు వివిధ ఆప్షన్స్‌ ను అందుబాటులో వుంచామన్నారు. ఏటిఎం లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ లావాదేవీలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ఏటిఎం ఆపరేషన్స్‌ వ్యయం నానాటికీ పెరుగుతోందని, కాబట్టి డిజిటల్‌‌‌‌ లావాదేవీలకు ప్రాముఖ్యమివ్వాలని కస్టమర్లను కోరుతున్నారు గుప్తా.

Posted in Uncategorized

Latest Updates