అత్తాపూర్ నడిరోడ్డుపై దారుణ హత్య.. పాతకక్షలే కారణం

హైదరాబాద్ : నగరంలోని అత్తాపూర్ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని మర్డర్ చేశారు దుండగులు. అత్తాపూర్ లోని పిల్లర్ నంబర్ 139 దగ్గర రమేష్ గౌడ్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసి చంపేశాడు ఓ దుండగుడు.  ఓ హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న రమేష్ గౌడ్.. కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా.. ఈ మర్డర్ జరిగింది. దుండగులు వందమీటర్ల వరకు రమేశ్ గౌడ్ ను వెంటాడారు. నడిరోడ్డుపైనే అతడిని గొడ్డలితో నరికి చంపేశాడు ఓ దుండగుడు.

తనను రక్షించాలంటూ బాధితుడు వేడుకున్నా చుట్టూ చూస్తున్న జనం ఏమాత్రం స్పందించలేదు. వాహనాలు పక్కనుంచి వెళ్తూనే ఉన్నాయి. చుట్టూచేరిన జనం డివైడర్లు ఎక్కి చూస్తుండిపోయారు. చంపుతున్న వ్యక్తి అతి దగ్గరలోనే ఉన్నా.. పెద్దగా స్పందించలేదు. రమేష్ గౌడ్ ను వెంటాడి పట్టుకున్న ఇద్దరు దుండగులు ఒకరి తర్వాత ఒకరు దాడిచేశారు.

నల్ల రంగు అంగి వేసుకున్న వ్యక్తి.. ఇద్దరు దుండగులను వెనుకనుంచి తన్ని బెదిరించే ప్రయత్నం చేశాడు.  మిగతావాళ్లు నిందితుడి చేతిలో గొడ్డలి చూసి ఆగిపోయారు. హత్య జరిగేటప్పుడు పోలీస్ వెహికల్ అక్కడకు చేరుకుంది. గస్తీ పోలీసులు కూడా వాహనం నుంచి మొదట కిందకు దిగలేదు. కొంత టైమ్ తీసుకుని దిగారు. ఈలోపల.. రమేష్ గౌడ్ ను నిందితులు చావగొట్టాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

చనిపోయిన వ్యక్తి పాతనేరస్తుడైన రమేష్ గౌడ్ అని గుర్తించారు పోలీసులు. గతంలో ఓ మహిళ విషయంలో మహేశ్ గౌడ్ అనే వ్యక్తిని.. చంపేసి శిక్ష అనుభవిస్తున్నాడు రమేష్ గౌడ్ అలియాస్ రాజేశ్ గౌడ్. కలుద్దామని మహేశ్ గౌడ్ కు చెప్పి…. జుమ్మేరాత్ బజార్ లో అతడిని కిడ్నాప్ చేసి.. మైసిగండికి తీసుకెళ్లి హత్యచేశాడు రమేశ్ గౌడ్. బాడీని కారులో తీసుకెళ్లి.. మరోచోట పడేశాడు. వెంటనే కారును సర్వీసింగ్ కు ఇచ్చాడు రమేష్ గౌడ్. కారు సర్వీసింగ్ చేయించేటప్పుడు రక్తపు మరకలు చూసిన మెకానిక్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు అలా… రమేష్ గౌడ్ కు శిక్షపడేలా చేశారు. జైలు నుంచి బయటకొచ్చిన రమేష్ గౌడ్ ను చంపేందుకు మహేశ్ గౌడ్ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు విచారణకు హాజరై వెళ్తుండగా ఇలా మాటువేసి అత్తాపూర్ లో పగతీర్చుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పగ తీర్చుకున్నా అని అరిచాడని స్థానికులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates