అత్తారింటికి దారిది : ఇలా వెళ్లి…అలా రావచ్చు

తెలంగాణలోని “ఆనంద్ పూర్”, మహారాష్ట్రలోని దిగ్రజ్…ఈ రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటాయ్. ఇక్కడ ఉండేవాళ్లలో చాలామంది తెలుగు, మరాఠీ రెండు భాషలు మాట్లాడుతారు. అందుకే ఈ ప్రాంతాల మధ్య పెళ్లి సంబంధాలు పెరిగాయ్, పండుగలు, పబ్బాలప్పుడు ఇక్కడివాళ్లు అక్కడ, అక్కడ వాళ్లు ఇక్కడ కనిపిస్తుంటారు.

అయితే ఇక్కడ ఓ చిన్న సమస్య ఉండేది. రెండు ప్రాంతాలు పక్కపక్కనే ఉన్నప్పటికీ మధ్యలో నది ఉండటం వల్ల 45 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో వారందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. పెన్ గంగ నదిపై వంతెన నిర్మిస్తే అత్తారింటికి దారి సులభమవుతుందని భావించారు. అక్కడి నాయకులకు విషయం చెప్పారు. నాయకులు కూడా అత్తారింటికి వెళ్లాలంటే అదే దారి కావడంతో…వెంటనే దీనిపై స్పందించారు. బ్రిడ్జి పనులు స్టార్ట్ చేసి…వేగంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పుడు బ్రిడ్జి కట్టిన తర్వాత రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం నాలుగు కిలోమీటర్లే. బ్రిడ్జి నిర్మాణం వేగంగా పూర్తవడంతో అత్తారిళ్లకు ఇలా వెళ్లి..అలా రావచ్చు అని గ్రామస్ధులు సంతోషం వ్యక్తం చేశారు. దిగ్రజ్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అత్తగారి ఊరు ఆనందపూర్ ప్రాంతంలోని కౌట కావడంతో ఇంకా కలిసొచ్చింది.

అంతేకాకుండా బ్రిడ్జి నిర్మించడంతో రెండు ప్రాంతాల మధ్య వ్యాపార లావాదేవీలు కూడా పెరిగాయ్.

Posted in Uncategorized

Latest Updates