అథ్లెటిక్స్ ప్లేయర్లను ప్రభుత్వాలు గుర్తించాలి : పీటీ ఉష

ఇటీవల జరిగిన IAAF వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌ లో గోల్డ్ మెడల్ గెలిచిన ఫస్ట్ భారత అథ్లెట్‌ గా హిమదాస్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పరుగుల రాణీ పీటీ ఉష హిమదాస్ పై ప్రశంసలు కురిపించింది.  హిమదాస్ ను చూస్తుంటే తనను తాను చూసుకుంటున్నట్లు ఉందని చెప్పింది.

ఈ సందర్భంగా తన క్రీడా జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు. తాను క్రీడల్లో పాల్గొనే రోజుల్లో ప్రభుత్వాలు పట్టించుకునేవి కావని, ఫ్యామిలీలోనూ ప్రోత్సాహం ఉండేదికాదని తెలిపారు. అయితే ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారిణులకు దేశం ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. ఏవేవో కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు వరదలో ముంచెత్తాయి.. ఆకాశానికి  ఎత్తాయి.. కార్లు ఇచ్చాయి.. కానుకలిచ్చాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ చాలా మంది స్పాన్సర్లు, పుష్కలంగా డబ్బులున్న టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ స్టార్లకే కాకుండా.. మట్టిలో మాణిక్యమైన హిమ దాస్‌ వంటి గ్రామీణ క్రీడాకారులకు కూడా సాయం అందిస్తే బాగుంటుందని తెలిపారు పీటీ ఉష.

అంతేకాకుండా శిక్షణకు అవసరమైన సహకారాన్ని అందించాలని, ట్రైనింగ్ సమయంలో డాక్టర్లు, ట్రైనీలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సహాయం అందిస్తే బాగుంటుదని చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన ప్లేయర్ల కుటుంబాలను ఆదుకోవాలని, తద్వారా క్రీడాకారులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం అందుతుందన్నారు. హిమా దాస్, నీరజ్ చోప్రా, జిస్నా మాథ్యూ వంటి అథ్లెట్లకు  ప్రభుత్వం .. బ్యాంకులు , కార్పొరేట్లు నెలవారీ వేతనాలను ఇవ్వాలని సూచించిన ఉష..  వారి కుటుంబానికి ఆహారం ఇవ్వడం గురించి వారు ఆందోళన చెందకపోతే, వారు ఆచరణలో బాగా శ్రద్ధ చూపుతారని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates