అదరగొడుతున్నారు : షూటింగ్ లో భారత్ కు గోల్డ్

JITU ROYఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. భారత షూటర్‌ జీతురాయ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. సోమవారం (ఏప్రిల్ 9) జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు జీతురాయ్. ఇదే పోటీలో మరో భారత షూటర్‌ ఓంప్రకాశ్‌ మిథర్వాల్‌ కాంస్యం పతకాన్ని సాధించాడు.

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్‌ మొదటిస్థానాన్ని సాధించగా.. ఆస్ట్రేలియా షూటర్‌ కెర్రీ బెల్‌ 233.5 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 214.3 పాయింట్లతో ఓంప్రకాశ్‌ కాంస్యాన్ని సాధించాడు. దీంతో భారత్‌ ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 84 పతకాలు (31 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు)తో మొదటిస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ 48 పతకాలతో(19 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు) రెండోస్థానంలో ఉంది.

Posted in Uncategorized

Latest Updates