అదిరింది : మెర్సల్‌కు ఇంటర్నేషనల్‌ అవార్డు

ADIRINDIకోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన మెర్సల్‌ సినిమా అరుదైన ఘనత సాధించింది. యూకే నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు సినిమాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే పట్టం కట్టింది. GST డైలాగులతో ఈ మూవీ అభ్యంతరాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమాలో కొన్ని డైలాగులు తమను కించపరిచేలా ఉన్నాయంటూ ప్రైవేట్‌ వైద్య సంఘాలు సినిమా రిలీజ్‌ కాకుండా ఆందోళన చేపట్టాయి. అయినప్పటికీ అవన్నీ అధిగమించి విడుదలై మెర్సల్‌ హిట్‌ టాక్‌ కైవసం చేసుకుంది.

అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్‌ మూల కథను సమకూర్చారు. నిత్యామీనన్‌, కాజల్‌, సమంతలు హీరోయిన్‌ గా నటించిన మెర్సల్‌ తెలుగులో అదిరింది పేరుతో విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates