అదిరిపోయింది : ఐఫోన్ X ఫీచర్స్ తో.. mi 8 వచ్చేసింది

చుఫీచర్స్ బాగుండాలి.. ధర తక్కువగా ఉండాలి.. చూడటానికి బాగుండాలి.. అలా అని ఎక్కువ ధర పెట్టలేం.. ఈ మాటలు వినగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది షియోమీ ఎంఐ ఫోన్లు. ఇప్పుడు మరో సంచలనానికి తెర తీసింది. ఎంఐ 8 (mi 8) రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫోన్లలో ఇదో విప్లవం అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఎందుకంటే.. లక్ష రూపాయల విలువ అయిన ఐఫోన్ ఎక్స్ లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయని.. డిస్ ప్లే లుక్ కూడా అలాగే ఉందని చెబుతున్నారు. చైనాలో గ్రాండ్ గా ఈ ఫోన్ లాంఛింగ్ జరిగింది. జూన్ నెలాఖరులోపు ఇండియాలో కూడా విడుదల కాబోతున్నది.

ఎంఐ 8 వేరియంట్స్ ఏంటీ :

… 6 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ ఫోన్ ధర రూ.28వేల 460గా నిర్ణయించారు. 128 GB స్టోరేజ్ ఫోన్ రూ.31వేల 620గా ఉంది. 256 GB స్టోరేజీ ఫోన్ ధర రూ.34వేల 785గా ఉంది.

… MI 8 ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ పేరుతో మరో వేరియంట్ ఫోన్ కూడా రిలీజ్ చేసింది. ఇది 8 GB ర్యామ్, 256 GB స్టోరేజీ ఉంటుంది. ఇండియన్ మార్కెట్ లో రూ.40వేల దొరుకుతుంది. ఈ ఫోన్లను చైనా అత్యంత ఘనంగా నిర్వహించిన ప్రోగ్రామ్ ద్వారా విడుదల అయ్యాయి. జూన్ 5వ తేదీ నుంచి స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇండియాలోకి రావాలంటే మరికొంత సమయం పడుతుంది.

ఫీచర్స్ ఎలా ఉన్నాయి :

ఎంఐ 8 డిస్ ప్లే 6.21 ఇంచ్. 88.81శాతం స్కీన్ డిస్ ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో పని చేస్తోంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సల్, ఫోన్ వెనక 12 మెగాపిక్సల్ రెండు కెమెరాలు ఉన్నాయి. ఫింగర్ ఫ్రింట్ ఉంది. మన ఫేస్ ద్వారా ఫోన్ అన్ లాక్ ఆప్షన్ కూడా ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత ఇందులోనే ఈ ఆప్షన్ ఉంది. మన ముఖాన్ని 3డీ సెన్సార్ తోనే ఫొటోగా మార్చుకునే సదుపాయం కూడా ఉంది.

రెండు సిమ్స్ కార్డులు పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా 4జీ ఓల్ట్ తో పని చేస్తాయి. డ్యుయల్ బ్యాండ్ వైఫై ఉంది. 3400 mAh బ్యాటరీ. చార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. Mi 8 ఎక్స్ ప్లోరర్ ఫోన్ చూసినా, ఫీచర్స్ విన్నా అచ్చం ఐఫోన్ ఎక్స్ గుర్తుకొస్తుంది అంటున్నారు. అయితే ఐఫోన్ కావాలంటే లక్ష రూపాయలు పెట్టాలి.. బ్రాండ్ తో సంబంధం లేకుండా అవే ఫీచర్స్ లో ఎంఐ 8 మాత్రం రూ.40వేలకే దొరుకుతుంది.

Posted in Uncategorized

Latest Updates