అదిరిపోయింది : మహానటి టీజర్ రిలీజ్

MKJమహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమా టీజర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. అనగనగా ఒక మహానటి  అంటూ టీజర్ మొదలవుతుంటే కీర్తి సురేష్ అభివాదం చేస్తూ ఉంటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్‌, జెమినీ గణేశణ్ గా దుల్కర్ సల్మాన్, మధురవాణిగా సమంత జర్నలిస్ట్‌ నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్రలో ఈ సినిమాలో కన్పించనున్నాడు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. మే 9న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Posted in Uncategorized

Latest Updates