అది కూడా సప్లిమెంటరీ : ఆ ఒక్కడు ఎగ్జామ్ రాస్తే.. 12 మంది సెక్యూరిటీ

ssc-exam

ఒకే ఒక్కడు.. ఎగ్జామ్ రాశాడు.. ఏకంగా 12 మంది సెక్యూరిటీ ఇచ్చారు. పాస్ అవుతాడో లేదో తెలియదు కానీ.. వీడు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ మార్కులు సంపాదించేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జూన్ 6వ తేదీ టెన్త్ సప్లిమెంటరీ హిందీ ఎగ్జామ్ జరిగింది. మొత్తం ఏడుగురు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంది. ఆరుగురు పిల్లలు డుమ్మా కొట్టారు. ఒకే ఒక్కడు మాత్రం ఎగ్జామ్ కు హాజరయ్యాడు. ఎంత మంది హాజరు అయినా సరే.. ఎగ్జామ్.. ఎగ్జామే కాబట్టి.. స్టాప్ మొత్తం అటెండ్ అయ్యింది. అసలు పిల్లలు ఎవరూ అటెండ్ కాకపోయినా.. రూల్స్ ప్రకారం ఎగ్జామ్ అయ్యే వరకు సెంటర్ లో ఉండాలి.

కాకపోతే ఇక్కడ ఒకే ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ కు హాజరవటం.. 12 మంది సిబ్బంది విధులు నిర్వహించటం జరిగిపోయింది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారి, క్లార్క్, ఇన్విజిలేటర్, అటెండర్, ANM, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు రెండు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు వచ్చి తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ అయితే 10 కిలోమీటర్లు జర్నీ చేసి మరీ వచ్చి ఇక్కడ తనిఖీ చేసింది. మొత్తానికి ఈ ఒక్కడు పాస్ అవుతాడో లేదో రిజల్ట్స్ లో చూడాలి.

Posted in Uncategorized

Latest Updates