అది మాత్రం మిస్ కావద్దు : కాంగ్రెస్ లో చేరుతానన్న చేతన్ భగత్

chetaప్రముఖ రచయిత, కాలమిస్ట్, మోటివేషనల్ స్పీకర్ చేతన్ భగత్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నానని చేతన్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ కాంపెయిన్ కి సపోర్ట్ చేస్తానని చేతన్ ఆ ట్వీట్ లో తెలిపాడు. రాహుల్ గాంధీతో కలసి మెరుగైన భారత్ ని తయారుచేయడం కోసమే ఈ నిర్ణయమని తెలిపారు. ఇంతపెద్ద అడుగు వేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని, ఇవిగో వివరాలని చేతన్ ఓ లింక్ ను తన ట్వీట్ లో జత చేశాడు. చేతన్ ట్వీట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వేల లైక్ లు, వందల రీ ట్వీట్లు వచ్చాయి. ఇప్పటివరకుా మీ పుస్తకాలు చదివామని.. ఇక నుంచి మానేస్తామని, కాంగ్రెస్‌లో చేరితే మిమ్మల్ని అన్‌ఫాలో అవుతానని, ఏప్రిల్ ఫూల్ అని, మీలాంటి వారందరూ వచ్చి అసలైన కాంగ్రెస్‌ విలువలను నిలబెట్టాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ట్వీట్ చివర్లో చేతన్ పెట్టిన లింక్‌ను చేస్తే ఏప్రిల్‌ ఫూల్స్‌ డే అంటూ వికీపీడియా పేజ్‌ తెరుచుకుంటుంది. ఏప్రిల్‌ 1న ఫూల్స్‌డే సందర్భంగా చేతన్ చేసిన సరదా ట్వీట్‌ అని అర్ధమవుతుంది.

Posted in Uncategorized

Latest Updates