అది స్కూలా.. మాఫియానా : ఫీజు కట్టలేదని చిన్న పిల్లలను నిలబెట్టేశారు

లిటిల్ గార్ల్స్.. పేరు వింటేనే ముద్దొస్తుంది. ఏది రైటు.. ఏది రాంగ్ అనేది కూడా తెలియదు. స్కూల్ అంటే అల్లరి చేయొచ్చు.. ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు అని మాత్రమే తెలుసు.. వారికి ఫీజు గురించి.. ప్రతి నెలా పేరంట్స్ డబ్బులు కడతారు అన్న సంగతి కూడా తెలియదు.. అలాంటి చిన్నారులను ఫీజు కట్టలేదనే నెపంతో స్కూల్ బిల్డింగ్ సెల్లారులో నిలబెట్టింది యాజమాన్యం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది చిన్నారులకు ఇలా పనిష్మెంట్ ఇచ్చింది. వారు చదువుతున్నది ఫస్ట్ క్లాస్.. అందరి వయస్సు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పేరంట్స్ అందరూ భగ్గుమంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ చాందిని చౌక్ ప్రాంతంలో రబియా గార్ల్స్ పబ్లిక్ స్కూల్ ఉంది. ఎప్పటిలాగే సోమవారం ఉదయం పిల్లలను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లారు పేరంట్స్. మరికొందరు బస్సుల్లో వచ్చారు. అలా వచ్చిన వారిలో 50 మంది చిన్నారులను స్కూల్ యాజమాన్యం బేస్ మెంట్ దగ్గర నిలిపేసింది. మీ పేరంట్స్ స్కూల్ ఫీజు కట్టలేదని వారితోనే చెప్పింది. వారు ఏం చెబుతున్నారో కూడా ఆ పిల్లలకు అర్థం కాలేదు. ఎందుకు నిలబెట్టారో కూడా అర్థం కాలేదు. వారు అలాగే నిలబడిపోయారు. మరికొంత మంది పిల్లలు అయితే చాలాసేపు నిలబడలేక.. కింద పడిపోయారు. నాలుగు గంటల తర్వాత వారిని క్లాసుల్లోకి అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని యాజమాన్యమే పేరంట్స్ కు సమాచారం ఇచ్చింది. స్కూల్ ఫీజు వసూలు చేసే పద్దతి ఇదేనా అంటూ స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరంట్స్. కొందరు అయితే మేం ఎప్పుడో ఫీజు కట్టేశాం అని.. అయినా మళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారు అంటూ నిలదీశారు. మరికొంత మంది పేరంట్స్ పిల్లలను స్కూల్ నుంచి తీసుకెళ్లిపోయారు. దీనిపై స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాదానం చెప్పటంతో.. పేరంట్స్ హజ్ కాస్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఫైల్ చేశారు. సాక్ష్యంగా ఫొటోలు సమర్పించారు.
పోలీస్ స్టేషన్ లో FIR నమోదు అయిన తర్వాత కూడా స్కూల్ యాజమాన్యం వైఖరిలో మార్పు రాలేదు. మా రికార్డ్స్ ఫీజు చెల్లించినట్లు నమోదు కాలేదు అంటూ మొండిగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు తల పట్టుకున్నారు. పిల్లలను బేస్ మెంట్ లో గంటల తరబడి నిలబెట్టటంపై పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. స్కూల్ పై చర్యలు తీసుకుంటాం అని హామీ ఇస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates