అదృశ్యమైన 22 మంది భారతీయులు సేఫ్ : సుష్మా

sushma-swaraj-pti_650x400_71515164634ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలో 22 మంది భారతీయ కార్మికులతో వెళ్తున్న ఓ నౌక అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే ఆ కార్మికులంతా క్షేమంగా ఉన్న‌ట్లు మంగళవారం (ఫిబ్రవరి-6) విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తెలిపారు. పైరేట్స్ వాళ్ల‌ను రిలీజ్ చేసిన‌ట్లు సమాచారం. గతవారం గల్ఫ్ ఆఫ్ గునియాలోని బెనిన్ బీచ్ తీరంలో భార‌తీయ కార్మికులతో ఉన్న ఆయిల్ ట్యాంక‌ర్ అదృశ్య‌మైంది. పనామాకు చెందిన మెరైన్ ఎక్స్‌ప్రెస్ నౌకలో భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. ఇదే ప్రాంతంలో నెల రోజుల క్రితమే ఓ నౌకను సముద్ర దొంగలు దోచుకెళ్లారు. అయితే మెరైన్ ఎక్స్‌ప్రెస్ ఆయిల్ ట్యాంకర్ కోసం బెనిన్ నేవీ దళాలు తీవ్రంగా అన్వేషించాయి. మెరైన్ ఎక్స్‌ప్రెస్ రవాణా నౌకలో సుమారు 14 వేల టన్నుల ముడి చమురు ఉన్నది. బెనిన్ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవ‌ల ఓ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates