అదృష్టం అంటే వీరిదే : ఒక్క లాటరీతో కోట్లు వచ్చాయి

lottrఒక్క లాటరీ టికెట్ వారి.. తలరాతను మార్చేసింది. నిన్నటి వరకూ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి జీవితాలు లాటరీతో మారిపోయాయి. లక్కీ డ్రాలో అక్షరాల రూ.6.5 కోట్లు గెల్చుకుని ఓవర్ నైట్ లో కోటీశ్వరులు అయ్యారు. వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.

కేరళలో రాష్ట్రం త్రిసూర్‌ కి చెందిన ఫ్రాన్సిస్‌ సెబాస్టియన్‌, పింటో పాల్‌ తొమ్మాన ఇద్దరూ స్నేహితులు. బాల్యం నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ తమ కుటుంబాలతో యూఏఈలోని షార్జాలో నివసిస్తున్నారు. సెబాస్టియన్‌ అరేబియన్‌ ఆటోమొబైల్స్‌లో పని చేస్తుండగా, పింటో పాల్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ మార్చిలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్ధ నుంచి ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. వీరు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెంబర్ 2465. ఏప్రిల్ 10వ తేదీ లక్కీ డ్రా తీశారు. వీరు కొనుగోలు చేసిన లాటరీకి ఒక మిలియన్‌ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో అక్షరాల ఆరున్నర కోట్లు గెల్చుకున్నారు. అదే రోజు సెబాస్టియన్‌ భార్య లియోనీ ఫ్రాన్సిస్‌ పుట్టిన రోజు కావడంతో వారి ఆనందానికి అవుధులు లేకుండాపోయింది.

 

Posted in Uncategorized

Latest Updates