అదృష్టవంతులు : తన సంస్ధలో పనిచేసే ఉద్యోగులకి బెంజ్ కార్లు గిఫ్ట్ గా ఇచ్చాడు

సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా  తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు పెద్ద సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. ఎన్నో ఏళ్లుగా తమసంస్థలో నమ్మకంగా పనిచేస్తోన్నముగ్గురు సీనియర్ ఉద్యోగులకు.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు విలువ చేసే బెంజ్ కార్లను గిఫ్ట్ గా ఇచ్చాడు.

బెంజ్ కార్లు అందుకున్న నిలేశ్ జదా,ముకేశ్మహేశ్ చంద్ పరా.. తమ 13-15 ఏళ్ల వయస్సులోనే ఈ కంపెనీలో చేరి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు సంస్థలో అత్యంత కీలక విభాగాలకు హెడ్ లుగా ఉన్నారు. సుమారు 25 ఏళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తుండడంతో వారికి ఈ బహుమతులను ఇచ్చినట్లు ధోలాకియా తెలిపారు. శనివారం(సెప్టెంబర్-30) సంస్ధలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ చేతుల మీదుగా ముగ్గురికి కార్లను అందించారు.గతంలో కూడా తన సంస్ధలో ఏళ్లుగా నమ్మకంతో పనిచేస్తోన్న 1200 మంది ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఫ్లాట్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారు ధోలాకియా

Posted in Uncategorized

Latest Updates