అదే పెద్ద ఉద్యోగం : కానిస్టేబుళ్లుగా ఇంజినీర్లు, MBA, టెకీలు

police-jobsగుజరాత్ వెలిగిపోతుంది.. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో నెంబర్ వన్.. ప్రపంచ వ్యాప్తంగా గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టిన అక్కడి ప్రభుత్వాలు.. ఇప్పుడు ఓ షాకింగ్ విషయం కూడా బయటకు వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో కొత్త ఉద్యోగంలో చేరుతున్న కానిస్టేబుళ్లలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండటం విశేషం. 2017లో పోలీస్ కానిస్టేబుళ్లగా ఎంపిక అయిన వెయ్యి మందిలో ఇంజినీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, బీసీఏ(బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్) చదువుకున్న వారు ఉన్నారు. వాస్తవం ఈ ఉద్యోగాలకు అర్హత పదో తరగతి, మరికొన్నింటికి ఇంటర్మీడియట్. తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు ఇంజినీర్లు, ఎంబీఏ, బీసీఏ చేసిన అభ్యర్థులు కూడా పరీక్ష రాయటంతో అర్హులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.

2017 లెక్కల ప్రకారం. వెయ్యి మంది కానిస్టేబుళ్లలో 458 మంది BCA చదివిన వారు ఉన్నారు. మరో 341 మంది BE/B.TECH చదివారు. 49 మంది B.Sc/M.Sc(IT) వారు ఉన్నారు. మరో 29 మంది MCA చదివారు. ఇద్దరు మాత్రం ఎంటెక్ చదివారు. మిగిలిన 25 మంది డిగ్రీ విద్యార్హతగా ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకుని.. పోలీస్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోనే ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. బి.టెక్ చదవిన వారిని FIR విభాగంలో నియమిస్తున్నారు. అయితే వారికి ట్రాన్స్ లేషన్ కూడా సరిగా రావటం లేదని.. ఇంగ్లీష్ నుంచి గుజరాత్ భాషలోకి మార్చటం.. గుజరాతీ నుంచి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయటం కూడా సరిగా రావటం లేదని.. ఇలాంటి వారు బీటెక్, ఎంటెక్ ఎలా చదివారో కూడా అర్థం కావటం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు.

ఉన్నత విద్యార్హత కలిగిన వారు కూడా కానిస్టేబుళ్లుగా వస్తుండటంతో.. 10, ఇంటర్ క్వాలిఫికేషన్ తోనే పోటీ పడే వారికి తీరని అన్యాయం జరుగుతుందని అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates