అదే మనోళ్లు అయితేనా : పార్లమెంట్ లో క్లీనింగ్ స్టిక్ పట్టిన ప్రధాని

Mark-Rutteఅతనో ప్రధాని.. దేశానికే రాజు. అలాంటి వ్యక్తి.. తాను చేసిన పొరపాటును తానే సరి చేసుకున్నారు. చుట్టూ మందీ, మార్భలం ఉన్నా.. పదుల సంఖ్యలో క్లీనింగ్ చేసే సిబ్బంది ఉన్నా.. ఏ మాత్రం మొహమాటం పడలేదు. నా తప్పుకు మీరెందుకు పని చేస్తారు అంటూ వారిని ప్రశ్నించారు. పనోళ్లు ముందే.. తాను ఆ పని చేసి దేశ ప్రజలకు తాను ఎంత కామన్ మ్యానో నిరూపించారు. ఇది జరిగింది భారతదేశంలో కాదండీ.. నెదర్లాండ్స్ లో. వివరాల్లోకి వెళితే..

నెదర్లాండ్ (డచ్) ప్రధానమంత్రి మార్క్ రుట్టే. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సభలోకి వెళ్లటానికి బయలుదేరారు. నడుస్తూనే ఓ చేతిలో ఫైల్, మరో చేతిలో కాఫీ కప్పు పట్టుకుని మరో అధికారితో మాట్లాడుతూ వస్తున్నారు. సెక్యూరిటీ వింగ్ తాటే సమయంలో ఆయన చేతిలో కాఫీ కప్పు పొరపాటున కింద పడింది. కాఫీ నేలపాలు అయ్యింది. ఏ మత్రం ఆలోచించకుండా.. చేతిలోని ఫైల్ పక్కన పెట్టారు. ఆ పక్కనే ఉన్న క్లీనింగ్ స్టిక్ తీసుకున్నారు. నేలపై పడిన కాఫీని శుభ్రంగా క్లీన్ చేశారు. ప్రధానమంత్రి మార్క్.. క్లీన్ చేయటం చూసిన సర్వీస్ సిబ్బంది పరిగెత్తుకుటూ వచ్చారు. ప్రధానమంత్రి చేతిలోని స్టిక్ తీసుకోవటానికి ప్రయత్నించారు. ఆయన ఏ మాత్రం చిరాకు పడకుండా.. నవ్వారు. నేను బాగా క్లీన్ చేస్తున్నానా.. ఇలాగే కదా అంటూ సిబ్బందితో అన్నారు. నేను చేసిన తప్పుకు మీరు ఎందుకు క్లీన్ చేస్తారు అంటూ వారిని వారించి.. కాఫీ మొత్తాన్ని క్లీన్ చేసి అక్కడి నుంచి వెళ్లారు.

మన మన దగ్గర అయితేనా.. పక్కనోళ్లను పిలిచి మరీ క్లీన్ చేయమంటారు. అంత ఎందుకు పొలిటికల్ లీడర్స్ చెప్పులు కూడా మోయిస్తారు. కాళ్లకు బూట్లు తొడిగించుకుంటారు.. చెప్పులు మోయిస్తారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి.. అందులోనూ పార్లమెంట్ లో.. నేతపై పడిన కాఫీని తానే స్వయంగా క్లీన్ చేయటాన్ని సోషల్ మీడియా అక్కున చేర్చుకుంది. నెటిజన్లు అయితే హ్యాట్సాఫ్, శెభాష్ అంటూ కీర్తిస్తున్నారు. ప్రజలతో ఎన్నికైన పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అంటే.. ఇలా ఉండాలి అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates