అద్దెకు ఇళ్లిస్తే అందినకాడికి దోచేశారు

విశాఖపట్నంలో యాజమానికే టోకరా వేశారు అద్దెకుంటున్న ముగ్గురు వ్యక్తులు. మాయమాటలు చెప్పి వారిని నమ్మించి అందినకాడికి దోచుకుని పరారయిన ఆ ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. టీజీఆర్ నగర్లో దవులూరి చంద్రరావు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి సీతారాం, తల్లి పద్మ,చెల్లెల్లు కుమారి సంవత్సరం కింద అద్దెకు దిగారు. తర్వాత ఇంటి యాజమానితో కలిసి మెలసి ఉంటూ…వారిని నమ్మించారు.  ఏమైనా సమస్యలు ఉంటే తమకు చెబితే  సంతోషిమాత,రాజమ్మ పూజలు చేసి బాగుచేస్తామని యాజమాని భార్యను నమ్మించారు. అలా వారు అడిగినవన్ని ఇచ్చింది.  మొత్తం 7 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ 4 లక్షల 20 వేల నగదును వారికి ఇచ్చేసింది. ఉన్నట్టుండి ఒక రోజు వాళ్లు కనిపించకపోవడంతో మోసపోయానని తెలుసుకుంది.ఈ విషయాన్ని తన భర్తకు చెప్పడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. ఐపీసీ సెక్షన్ 420,386,387 కింద నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Latest Updates