అద్దెకు బాయ్ ఫ్రెండ్…ఒంటరి మహిళల కోసం

ముంబైకి చెందిన కౌశిక్‌ ప్రకాశ్‌ అనే యువకుడు భారత్‌ లో తొలిసారిగా ‘రెంట్‌ ఏ బాయ్‌ఫ్రెండ్‌’ (అద్దెకు స్నేహితుడు) పేరుతో ఓ యాప్‌ను తీసుకువచ్చారు. ఒంటరి జీవితం గడిపే మహిళలకు, ఒత్తిడితో సతమతవుతున్నవారి జీవితాలకు భరోసా ఇచ్చేందుకు ఈ యాప్‌ను తీసుకువచ్చామని, వినడానికి కాస్త అదోలా ఉన్న.. ఇది మంచి సేవలనే అందజేస్తుందని కౌశిక్‌ అంటున్నారు. ఇది శృంగారానికి సంబంధించిన యాప్‌ కాదని ఆయన తెలిపారు. అందరు మగవాళ్లు ఇందులో సభ్యులుగా చేరలేరని, దీని కోసం కొన్ని టెస్ట్ లను ఎదుర్కొవాల్సి ఉంటుందని, అలాగే ఆ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదని, మాటతీరు, నడవడిక, బాడీ లాంగ్వేజ్‌, శారీరక, మానసిక స్థితిగతులను పూర్తిగా పరీక్షించిన తరువాతే ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు.
మహిళలు యాప్‌ ద్వారా ఎంపిక చేసుకున్న అద్దెకు స్నేహితులు 3 నుంచి 4 గంటలపాటు వారితో ఉంటుంటారు. అద్దెకు వచ్చే స్నేహితుడి ఖర్చు మహిళలే చెల్లించాలి. ఒకవేళ ఎక్కువ సమయం కావాలనుకుంటే ముందుగానే యాప్ లో తెలియజేయాల్సి ఉంటుంది. స్నేహితుడిగా ఉండాలనుకున్న వ్యక్తి సదరు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు.

Posted in Uncategorized

Latest Updates