అద్భుతం చేశారు : సినిమా సెట్టింగ్ కాదు.. మురికివాడ అందాలు

Mumbai-ARTముంబై.. ఈ మాట వింటే చాలు ప్రపంచంలోని అత్యంత ధనవంతులతోపాటు.. నిరుపేదలు నివసించే బస్తీలు గుర్తుకొస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ కూడా ముంబై నగరంలోనే ఉంది. వేల బస్తీలు, మురికివాడలు ఉన్నాయి. ఆ మురికివాడలకు ఇప్పుడు రంగులు అద్దుతున్నాయి. అక్కడి ప్రజల్లో మార్పుకి శ్రీకారం చుట్టారు. స్వచ్చంధ సంస్థలతోపాటు.. దేశవ్యాప్తంగా ఉన్న వాలెంటీర్లు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. వివరాల్లోకి వెళితే.. చల్ రంగ్ దే ఫౌండర్ అయిన దేదీప్యరెడ్డి మురికివాడల్లో మార్పుకి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముందు ఆ ప్రాంతంలోని అన్ని ఇళ్లకు రంగులు వేయాలని.. వివి రూపాల్లో కలర్ ఫుల్ గా మార్చినట్లయితే.. అక్కడి మనుషుల్లోనూ కొత్త ఆలోచనలు వస్తాయని నిర్ణయించారు. అందులో భాగంగా ముంబైలో ఖర్ దండా మురికివాడను ఎంచుకున్నారు. అక్కడ మొత్తం 7వేల ఇళ్లు ఉన్నాయి. ఇన్ని ఇళ్లకు రంగులు వేయాలంటే మాటలు కాదు.. ఇందుకోసం దేశవ్యాప్తంగా తన పౌండేషన్ ద్వారా పిలుపునిచ్చారు.

అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 2వేల మంది ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్, సామాజిక కార్యకర్తలు రంగులు వేయటానికి వచ్చారు. కొన్ని కంపెనీలు, ప్రభుత్వ సహకారం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 300 ఇళ్లకు పెయింటింగ్ వేశారు. రోడ్ల పక్కన, బ్రిడ్జీలు, షాపులకు కూడా అద్భుతమైన బొమ్మలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఖర్ దండా ఏరియా మొత్తం కవర్ చేయటానికి మరో మూడు నెలల సమయం పడుతుందని.. కాలనీ మొత్తాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు.

పని ప్రారంభించే సమయంలో స్థానికుల నుంచి సహకారం రాలేదు. ఉదయం లేవగానే ఎవరి పనుల్లో వాళ్లు వెళ్లిపోయేవారు. దీంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. అయితే వాలంటీర్ల వర్క్.. మారుతున్న ఇళ్ల రూపురేఖలు చూసి.. క్రమంగా స్థానిక యువత కూడా ఈ పని భాగస్వామ్యం అవుతుంది. ఇప్పుడు ముంబైలోని ఖర్ దండా చూసి అందరూ షాక్ అవుతున్నారు. 300 ఇళ్లు పూర్తయితేనే ఇలా ఉంది.. 7వేల ఇళ్లకు రంగులు పడితే ఎలా ఉంటుందో అని అందరూ చర్చించుకోవటం జరుగుతుంది. ఇప్పుడు స్థానికులే తలా ఓ చెయ్యి వేస్తుండటంతో.. పనులు వేగంగా సాగుతున్నాయి. పై నుంచి సినిమా సెట్టింగ్ లా ఉందంటూ స్థానికులు చర్చించుకోవటం విశేషం..

Posted in Uncategorized

Latest Updates