అద్భుతం: 9.5 ఓవర్లు.. 11 పరుగులు..10 వికెట్లు

క్రికెట్ లో రికార్డులు బ్రేక్ చేయాలంటే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచుల్లోనే సాధ్యం. అది కూడా కొంత మంది ఆల్ రౌండర్ ప్లేయర్లే రికార్డులను తిరగరాస్తూ..కొత్త రికార్డులను సృష్టిస్తారు. రికార్డులు సృష్టించడానికి ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనే ఆడాల్సిన  అవసరం లేదు. ట్రోఫీ మ్యాచుల్లో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు అని నిరూపించాడు  మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ యువ క్రికెటర్.

రెక్స్ రాజ్‌కుమార్ సింగ్ అనే 18 ఏళ్ల బౌలర్ ఈ అత్యంత అరుదైన ఫీట్‌ను సాధించాడు. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన కూచ్ బేహార్ ట్రోఫీ మ్యాచ్‌లో ఈ రికార్డు సృష్టించాడు. కేవలం 11 పరుగులు ఇచ్చి మొత్తం 10 వికెట్లు తీసుకున్నాడు. కళ్లు చెదిరే బౌలింగ్‌తో అరుణాచల్ ప్రదేశ్‌ను మణిపూర్ 10 వికెట్లతో ఓడించింది. మణిపూర్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 9.5 ఓవర్లు వేసిన రాజ్‌కుమార్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి అన్ని వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు హ్యాట్రిక్ తీసుకునే అవకాశం అతనికి దక్కడం మరో విశేషం. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయగా.. ఇద్దరిని ఎల్బీడబ్ల్యూగా, మరో ఇద్దరిని వికెట్ కీపర్ క్యాచ్ ద్వారా, మరొకరిని ఫీల్డ్ క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. దీంతో అరుణాచల్‌ప్రదేశ్ కేవలం 36 పరుగులకే ఔటయ్యాడు. ఈ లోస్కోరింగ్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ 138, మణిపూర్ 122 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో అరుణాచల్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates