అధికారంపై కాంగ్రెస్ పగటి కలలు : హరీశ్

HARISHకాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. జాతీయ పార్టీని నమ్ముకుంటే మిగిలేది శూన్యమన్నారు. ఆదివారం (ఫిబ్రవరి-11) ఖమ్మం జిల్లాలో పలు అభవృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి…మరుగుదొడ్డి కావాలన్న ఢిల్లీ నుంచి కాంగ్రెస్ వాళ్లు అనుమతి తీసుకోవలసిందేనని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా ఎండడానికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టను రెండేళ్లలో తాము పూర్తి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాను కల్పవల్లిగా చేస్తామన్నారు హరీష్ రావు.

Posted in Uncategorized

Latest Updates