అధికారంలోకి వస్తే పది రోజుల్లో రుణమాఫీ: రాహుల్

RAHULత్వరలోనే అసెంబ్లీ ఎన్నికలున్న కర్ణాటకలో జన ఆశీర్వాద యాత్ర కంటిన్యూ చేస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. బీదర్  ప్రాంతంలో  ఉన్న ఆయన… బసవ కళ్యాన్ లోని  అనుభవ మంటపాన్ని సందర్శించారు. మండప నిర్మాణ నమూనాని పరిశీలించారు. అక్కడి విశిష్టతల గురించి.. నిర్వాహకులు రాహుల్ కు వివరించారు. తర్వాత ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా రాహుల్ వెంట ఉన్నారు.

బీజేపీ,  ఆర్ఎస్ఎస్ పై  విమర్శలు కంటిన్యూ చేశారు రాహుల్. దేశంలోని అన్ని సంస్థలను తమ గుప్పిట్లో  పెట్టుకోవాలని అవి ప్రయత్నిస్తున్నాయన్నారు. RSS చెప్పినట్టు మోడీ ఆడుతున్నారని… నోట్ల రద్దు ఐడియా కూడా RSS దేనన్నారు. తర్వాత బీదర్ బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్. రైతుల రుణాలు  మాఫీ చేస్తామని  మరోసారి హామీ  ఇచ్చారు. అధికారంలోకి  వచ్చిన 10 రోజుల్లో  రుణమాఫీ అమలు  చేస్తామన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే GSTని సరళతరం చేస్తామన్నారు రాహుల్ గాంధీ.

Posted in Uncategorized

Latest Updates