అధికారంలోకి వస్తే 2 లక్షల రైతు రుణమాఫీ : ఉత్తమ్

uttamవికారాబాద్ జిల్లా చేవెళ్ల నుంచి సోమవారం (ఫిబ్రవరి-26) కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర మొదలైంది. బస్సు యాత్రకు మందు…. సర్వ మత ప్రార్ధనలు చేశారు కాంగ్రెస్ నేతలు. తాము అధికారంలోకి వస్తే… ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే నిర్మిస్తామని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులకు ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు.

సెంటిమెంట్ ఉందికాబట్టే చేవెళ్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభించామన్న ఉత్తమ్… ప్రజలు కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు.

Posted in Uncategorized

Latest Updates