అధిక వడ్డీ పేరుతో రూ.150 కోట్ల మోసంసిద్దిపేట జిల్లా గజ్వెల్ లో అధిక వడ్డీ ఇస్తానని రూ.150 కోట్లు ఫ్రాడ్ చేశాడు మెతుకు రవీందర్‌ అనే ఓ తెలుగు టీచర్.ఈయన సిద్దిపేట జిల్లా తూప్రాన్‌ మండలం రావల్లి ప్రభుత్వ స్కూల్ లో పనిచేస్తున్నారు. ఈజీ మనీని సంపాదించడంలో భాగంగా అధిక వడ్డీ స్కీం మొదలుపెట్టాడు.

రవిందర్ తన ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ‘సన్ పరివార్’ అనే పేరుతో ఏడు కంపెనీలు పెట్టారు. ఈ కంపెనీల్లో తన కుటుబసభ్యులనే బాగం చేశాడు. ‘కలిస్తే గెలుస్తాం’ అనే ట్యాగ్ లైన్ కంపెనీకి పెట్టాడు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లె న్యూ కలెక్టరేట్‌ బిల్డింగ్‌ ప్రాంతంలో ‘సన్‌పరివార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌’ ఆఫీసును ఏర్పాటు చేశాడు. మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టండి. వెయ్యికి ఆరు రూపాయల వడ్డీ తీసుకోండి అంటూ ప్రకటనలు ఇచ్చాడు. చాలా మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని… చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటళ్లలో సమావేశాలు ఏర్పాటుచేసి స్కీంలను వివరించాడు.

అత్యాశకు పోయిన కొందరు ప్రజలు.. నగదును ఇవ్వడానికి క్యూ కట్టారు. ఓకే ఏడాది రూ.150 కోట్లను 15 వేల మంది జమచేశారు. ఆ మనీ తో రవిందర్ భూములు కొన్నాడు. కొంతకాలం వడ్డీ సరిగ్గా ఇచ్చిన రవిందర్..కొన్ని రోజులుగా కస్టమర్లను తిప్పి పంపుతుండగా.. ఒకతనికి అనుమానం వచ్చి శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు.. రవిందర్ మోసం చేశాడని తెలుసుకుని.. అతన్ని అరెస్టు చేసి  బ్యాంకులో ఉన్న రూ.14 కోట్లను ఫ్రీజ్ చేశారు. మోసపోయామని తెలుసుకున్న వారు పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు.

Posted in Uncategorized

Latest Updates