అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురి మృతి

బెంగళూరు నుండి తిరిగొస్తుండగా అదుపుతప్పి బోల్తాపడిన కారు 

అనంతపురం: రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద బెంగళూరు-హైదరాబాద్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు సింగనమల మండలం ఆకులేడు గ్రామస్తులుగా గుర్తించారు. అమర్నాథ్(45), వెంకటలక్ష్మి (40) తోపాటు మరొకరు చనిపోయారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగళూరు వెళ్లిన వీరు స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. గొల్లపల్లి గ్రామం వద్ద కారు అదుపు తప్పింది. పల్టీలు కొట్టడంతో కారులో కూర్చున్న వారంతా ఎగిరిపడ్డారు. తీవ్ర రక్తగాయాలతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. కారు నడిపిన డ్రైవర్ బయటకు రాలేక కారులోనే ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

 

 

Latest Updates