అనగనగా 125 ఏళ్ల క్రితం : మహాత్మా గాంధీని రైల్లో నుంచి తోసేసి..

mahaమహాత్మ గాంధీ సత్యాగ్రహం ప్రారంభించి నేటికి సరిగ్గా 125ఏళ్లు. 1893,జూన్-7న సౌతాఫ్రికాలో యంగ్ లాయర్ గా ఉన్న గాంధీని నల్లజాతీయుడన్న కారణంతో పీటర్ మరిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్ దగ్గర రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ నుంచి బయటకు తోసేసిన ఘటనకు నేటితో 125 ఏళ్లు పూర్తయ్యాయి. సత్యాగ్రహానికి మొదటి పునాది పడింది అక్కడే. ఈ సంఘటనతో గాంధీ సత్యాగ్రహం వైపుకి అడుగులు వేస్తూ సౌతాఫ్రికాలోని, భారత్ లోని ప్రజలకు బ్రిటీష్ ఆధిపత్యం, వర్ణవివక్ష గురించి వివరించి వారిని చైతన్యవంతులను చేసి చివరకు 1947 ఆగస్టు 15న భారత్ కు స్వాతంత్రం సంపాదించి, తెల్లవారిని భారత్ వదిలేలా చేసేవరకూ గాంధీ ప్రయాణం ఓ చరిత్ర. రెండురోజుల పాటు గాంధీ సంస్మరణ దినోత్సవాలు జరుగుతాయని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. గాంధీ పోరాట స్పూర్తితోనే 1996 లో మెదటిసారి  ప్రజాస్వామ్య పద్దతిలో సౌతాఫ్రికాలో అధ్యక్షుడిగా నల్లజాతీయుడు నెల్సన్ మండేలా ఎన్నికయ్యాడు. తన రోల్ మోడల్ గాంధీజీ అని నెల్సన్ మండేలా చెబుతారు. నెల్సన్ మండేలాను సౌతాఫ్రికా గాంధీగా అక్కడి ప్రజలు చెబుతారు. మహాత్ముడి బయోపిక్ కూడా తెరపై ఆవిష్కృతమైంది. ఈ ఘటనకు 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సౌతాఫ్రికా కూడా మహాత్ముడికి నివాళులర్పించి ఆయనను స్మరించుకుంది.

Posted in Uncategorized

Latest Updates