అనాధలకు AMBలో స్పెషల్ షో : పిల్లలతో కలిసి ‘స్పైడర్ మ్యాన్’ చూసిన నమ్రత

పేదలు, అనాధలను ఆదుకునేందుకు మహేశ్ బాబు పెద్దమనసుతో స్పందిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేశ్ బాబు నిర్మించిన అత్యాధునిక సౌకర్యాల మల్టీ ప్లెక్స్ AMB సినిమాస్ లో అనాధ పిల్లలకోసం ప్రత్యేకంగా ఓ ప్రీమియర్ షో వేశారు. డిసెంబర్ 14న విడుదల కానున్న “స్పైడర్ మ్యాన్ -ఇన్ టు ద స్పైడర్ -వెర్స్” కార్టూన్ సినిమాను ఒకరోజు ముందే అనాధ పిల్లలకోసం ప్రత్యేకంగా ప్రీమియర్ స్పెషల్ షో వేశారు. మహేశ్ బాబు-సోనీ పిక్చర్స్ సంస్థ… సంయుక్తంగా ఆర్ఫాన్స్ చిల్డ్రన్ కోసం ఈ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. మహేశ్ బాబు భార్య ఘట్టమనేని నమ్రతా శిరోద్కర్.. పిల్లలతో కలిసి సినిమా చూశారు. వారితో మాట్లాడుతూ సరదాగా గడిపారు. సినిమాను 3-డీలో చూసిన 150 మంది పిల్లలు చాలా ఆనందపడ్డారని… నమ్రత వారితో కలిసి ఫొటోలు దిగారని నిర్వాహకులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates