అనుపమ ట్విట్ : ప్రకాష్ రాజ్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవు

ANUతేజ్..ఐ లవ్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. సినిమాతో పాటు రూమర్స్ లోనూ నిలిచిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ తో ..అనుపమకు గొడవలు అయినట్లు వార్తలు పుకార్లు చేశాయి. అయితే ఈ వార్తలను కొట్టిపారేసింది అనుపమ. తమ మధ్యన ఎలాంటి విబేధాల్లేవంటూ ఆదివారం (జూలై-80) ట్విట్టర్ ద్వారా ప్రకాష్ రాజ్ తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది. హలో గురు ప్రేమ కోసమే సినిమా షూటింగ్‌లో ప్రకాష్‌ రాజ్‌, అనుపమా పరమేశ్వరన్‌ల మధ్య గొడవలు జరిగాయని, అనుపమా కంటతడి పెట్టుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదన్నట్టుగా అనుపమ, ప్రకాష్‌రాజ్‌ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశారు. త్రినాథ్‌రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎనర్జీటిక్‌ స్టార్‌ రామ్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates