అనుమానాలూ ఉన్నాయి : కదులుతున్న రైల్లోనే యువతి ఆత్మహత్య

Hang-Trainరైలు.. ఒక్క బోగీ కనీసం 100 మంది అయినా ఉంటాయి.. రద్దీ లేదు అనుకున్నా 40, 50 మంది కచ్చితంగా బోగీలో ఉంటారు. అలాంటిది కదుతున్న రైలులో ఓ యువతి ఉరి వేసుకుని చనిపోవటం ఆశ్చర్యంతోపాటు అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ దగ్గర ఈ విషయాన్ని గుర్తించిన తోటి ప్రయాణికులు టీసీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుంది బిట్రగుంట ప్యాసింజర్ రైలు. ఓ యువతి నెల్లూరు వరకు టికెట్ కొనుగోలు చేసింది. బెజవాడలో ఎక్కిన అమ్మాయి.. రైలు బోగీలో అటూ ఇటూ తిరగుతుంది. చాలా సేపు బోగీ డోర్ దగ్గర నిలబడే ఉంది. ఈ విషయాన్ని గమనించిన టీసీ.. వెళ్లి సీట్లో కూర్చోవాలని కోరాడు. అప్పుడు రైలు ఒంగోలు స్టేషన్ దగ్గర ఉంది. టీసీ చెప్పటంతో వెళ్లి సీట్లో కూర్చున్నది. ఒంగోలు నుంచి రైలు కావలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ యువతి ఉరి వేసుకుని చనిపోయి ఉంది. బోగీలోని ఫ్యాన్ కు తన చున్నీతో వేలాడుతూ కనిపించింది. ఒంగోలు నుంచి కావలి వెళ్లటానికి గంట సమయం పడుతుంది. అంటే ఈ గంటలో ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది.

యువతి బ్యాగ్ పరిశీలించిన పోలీసులు.. అందులో డైరీని గుర్తించారు. అందులో తన వ్యక్తిగత విషయాలు ఉండే పేజీ చిరిగిపోయి ఉంది. కావాలనే చింపినట్లు స్పష్టం అవుతుందని పోలీసులు అంటున్నారు. బ్యాగ్ లో ఎలాంటి ఐడీ కార్డులు కూడా లభ్యం కాలేదు. అమ్మాయి వయస్సు 20 నుంచి 24 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. లేక ఆమె ఉరి వేసుకుందా అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. బోగీలోని మిగతా ప్రయాణికులు ఏం చేస్తున్నారు.. ఆ సమయంలో ఎవరూ చూడకపోవటం ఏంటీ.. ఆ బోగీలోని యువతి కూర్చున్న దగ్గర మిగతా ప్రయాణికులు ఉన్నారా లేరా.. రైల్లో యువతి ఆత్మహత్య చేసుకోవటంపై ఇలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని.. యువతి పేరు, ఇతర వివరాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates