అనుమానాస్పద స్థితిలో 8 నెమళ్లు మృతి

PEAనల్లగొండ జిల్లాలో ఎనిమిది నెమళ్లు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాయి. కృష్ణపేట ఫారెస్టు ఏరియాలో ఆదివారం(ఫిబ్రవరి-25) ఉదయం నెమళ్లు చనిపోయి కన్పించాయి. వ్యవసాయ పొలాల దగ్గర చనిపోయి పడిఉన్న నెమళ్లను గుర్తించిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చనిపోయిన నెమళ్లను స్వాధీనం చేసుకున్నారు. పురుగు మందులు చల్లిన పంటపొలాలను తినడం కారణంగానే అవి చనిపోయి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు నెమళ్లకు పోస్టు మార్టం నిర్వహించిన తర్వాతే అవి చనిపోవడానికి గల కారణాలు తెలుస్తాయన్నారు.

Posted in Uncategorized

Latest Updates