అనుష్కను చూసేందుకు ఆతృతగా ఉన్నా: విరాట్

639142-virat-kohliబాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పరి మూవీలో దెయ్యం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌ను ఇటీవలె విడుదల చేసింది యూనిట్. ఈ ట్రైలర్‌లో అనుష్క గెటప్ చాలా భయంకరంగా ఉంది. అతన్ని చంపాలనుకుంటున్నా.. నన్ను వదలివెళ్లొద్దు’ అంటూ అనుష్క చెప్పిన డైలాగులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ ట్రైలర్‌ను చూసిన భర్త విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సౌతాఫ్రికా నుంచే పరి ట్రైలర్‌పై ఆసక్తికరంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తన భార్యను దెయ్యం అవతారంలో చూసేందుకు చాలా ఆతృతగా ఉందని, సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ చూసి తనకు దిమ్మతిరిగిపోయిందని ట్విట్ చేశారు. ప్రోసిత్ రాయ్ అనే కొత్త దర్శకుడు ‘పరి’ మూవీని తెరకెస్తున్నారు. స్వయంగా అనుష్కనే క్రిఅర్జ్, క్లీన్ స్లేట్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. హోలీకి (మార్చి2న) విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Posted in Uncategorized

Latest Updates