అన్నదాతలను గుర్తించిన రాష్ట్రం తెలంగాణ : నిరంజన్ రెడ్డి

వనపర్తి : స‌రిహ‌ద్దుల్లో దేశాన్ని రక్షించే జవాన్ల‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్నారు వనసర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి. వ‌న‌ప‌ర్తిలో అన్న‌దాత దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిరంజ‌న్‌ రెడ్డి ఏడుగురు రైతుల‌ను శాలువాతో స‌త్క‌రించారు.

వాళ్ల‌ను పూల‌మాల‌తో స‌న్మానించి పాదాల‌కు సాష్ఠాంగ న‌మ‌స్కారం చేశారు. దేశంలో రైతుల పరిస్థితి అద్వానంగా ఉందని..తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్నదాతల కోసం కృషి చేస్తున్నారన్నారు. రైతుల కోసం ఏ ప్రభుత్వం పట్టించుకోని విధంగా రైతుబంధు, రైతుబీమా లాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి భేష్ అనిపించుకున్నట్లు తెలిపారు. ఇవాళ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పలుచోట్ల వేడుకలు నిర్వహించారు. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ జన్మదినమైన డిసెంబర్‌ 23న ప్ర‌తిఏడాది రైతు దినోత్సవం జరుపుకుంటారు.

 

Posted in Uncategorized

Latest Updates