అన్నదాతలను నిలువునా ముంచేసిన వడగండ్ల వాన

RAIN STONESనిజామాబాద్, నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం (ఫిబ్రవరి-12) వడగళ్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోర, ఏర్గగట్ల, బాల్కొండ, నందిపేట్ మండలాల్లో వడగళ్ల వాన పడింది. ఆర్మూర్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. గంటసేపు వడగండ్లు కురవడంతో ఇళ్ల ముందర వర్షంనీటి కంటే రాళ్లు ఎక్కువగా నిండిపోయాయి. వడగండ్ల వర్ణం అన్నదాతలను నిలువునా ముంచింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు తడిసిపోయింది. కోతకు వచ్చిన జొన్న రాళ్ల వర్షంతో నేలపాలైంది. వర్షం కారణంగా పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. పసుపు, జొన్న, కంది, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.

Posted in Uncategorized

Latest Updates