అన్నదాత మూవీకి సెన్సార్ కష్టాలు

rrపీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటించిన అన్నదాత సుఖీభవ సినిమాను సెన్సార్ బోర్డ్ అనుమతించాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు. దీనిపై ముగ్దుమ్ భవన్ లో వామపక్ష, ప్రజా సంఘాల నేతలు  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలు, సమస్యల పై నారాయణ మూర్తి సినిమా తీస్తే అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.

కార్పోరేట్ సినిమాలకు అనుమతిచ్చే సెన్సార్.. రైతన్నల సమస్యలపై తీసిన సినిమాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వటం లేదన్నారు అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క. సర్కార్ లోపాలను చెప్పేలా సినిమా ఉన్నందుకే అనుమతి ఇవ్వటం లేదన్నారు.  అన్నదాత సుఖీభవ సినిమాకు అనుమతి ఇవ్వాలని…లెఫ్ట్ పార్టీలతో పాటు…ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates