అన్నది అమిత్ షానే : ఖాళీగా ఉండటం కంటే.. పకోడీలు అమ్ముకోవటం బెటర్

Amit Shahపకోడీలు అమ్ముకుంటే తప్పేంటీ.. అందులో సిగ్గు పడే పని ఏముందీ అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా. రాజ్యసభలో సోమవారం(ఫిబ్రవరి-5) మొదటి సారి మాట్లాడారు. పకోడీలపై కాంగ్రెస్ చేసిన విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు. ఉద్యోగం ఏదీ చేయకపోవడం కన్నా పకోడీలు అమ్ముకోవడం మంచిది కాదా అన్నారు. రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని.. దాన్నే ఉద్యోగంగా భావించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ క్రమంలో రాజ్యసభలో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పకోడా రాజకీయాలు చేయటం సిగ్గుచేటు అన్నారు. పకోడీలు అమ్ముకునే వారు అడుక్కోవడం లేదు కదా అని ప్రశ్నించారు షా.

నిరుద్యోగిగా ఉండడం కన్నా కష్టపడడం తప్పు కాదన్నారు అమిత్ షా. సిగ్గుపడాల్సిన విషయం కాదన్నారు. ఒక పేదవాడు ఈ రోజు పకోడీలు అమ్ముకుంటే.. తర్వాత కాలంలో పారిశ్రామికవేత్త అయ్యే అవకాశం ఉందన్నారు. చాయ్‌వాలా ప్రధాని అయినప్పుడు.. ఈ దేశంలో ఏదైనా సాధ్యమేనన్నారు.

GST కాంగ్రెస్ వ్యతిరేకి అని.. రాష్ట్రాల్లో విశ్వాసాన్ని నింపి దీన్ని అమలు చేస్తున్నామన్నారు. దాన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ హేళన చేయడాన్ని తప్పుపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఆ స్థాయిలో పనిచేస్తున్న నాయకుడు  ప్రధాని మోడీ మాత్రమేనన్నారు అమిత్ షా..

Posted in Uncategorized

Latest Updates