అన్నలు ఓడిపోయారు.. తమ్ముళ్లు గెలిచారు..

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఒక చిత్రమైన వార్త ఇది. ఈ ఎన్నికల్లో పోటీచేసిన అన్నదమ్ములకు విభిన్నమైన అనుభవం ఎదురైంది. కొన్ని చోట్ల పోటీ చేసిన అన్నలు ఓడిపోయారు.. మరికొన్ని చోట్ల పోటీ చేసిన తమ్ముళ్లు గెలిచారు.

ఓడిన అన్నలు

తాండూరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. జడ్చర్ల నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ గా బరిలో నిలిచిన మల్లురవి పరాజయం పాలయ్యారు. నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్లభూపాల్ రెడ్డి చేతిలో… కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయారు.

గెలిచిన తమ్ముళ్లు 

మరోవైపు… కొడంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై… టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీ చేసిన మల్లు భట్టి విక్రమార్క, మునుగోడు కాంగ్రెస్ క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates