అన్నారం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలి : హరీష్

HARISHపెద్దపల్లి జిల్లాలో మంథని మండలం సిరిపురం దగ్గర సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ పనులను మంగళవారం (జూన్-12) పరిశీలించారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. అన్నారం పంపుహౌస్ పనులను అధికారులతో కలిసి చూశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అంతకుముందు ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా ఆఫీసర్లతో రివ్యూ చేశారు హరీష్.

వర్షం కారణంగా పనులకు కొద్ది సమయం ఆటంకం ఏర్పడుతుందని.. దీన్ని అధిగమించడానికి రాష్ట్రంలోని ఏజెన్సీలతో మాట్లాడి కార్మికులను పెంచాలని ఆదేశించామన్నారు. వారికి అవసరమైన వసతులు కల్పించాలని, ప్రతీరోజు మూడుషిఫ్టుల్లో పనిచేయించాలని సైట్ ఇంజినీర్లను ఆదేశించారు. ప్రతీరోజు మూడు షిఫ్టుల్లో పనిచేసే వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని చెప్పారు మంత్రి హరీష్.

Posted in Uncategorized

Latest Updates