అన్ని జిల్లాల్లో జనరిక్ మెడిసిన్ సెంటర్లు: సోలంకి

మెడిసిన్ ధరలు పెరిగిపోవడంతో…పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దేశంలో జన్ ఔషదీ స్టోర్స్ తో పేదలకు తక్కువ ధరలో జనరిక్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ ప్రేమ్ జీ భాయ్ సోలంకి. ఆయుష్మాన్ భారత్ కింద స్టంట్ల ధరలు తగ్గించినట్లే.. తక్కువ ధరలో పేదలకు మెడిసిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా జనరిక్ మెడిసిన్ సెంటర్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రేమ్ జీ భాయ్ సోలంకి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి మన్సుక్ మాండవీయ. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనరిక్ మెడిసిన్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates