అన్ని తండాలను పంచాయితీలు చేస్తాం : పోచారం

POCHARAMఐదు వందల మంది జనాభా ఉన్న తండాలన్నింటినీ గ్రామ పంచాయితీలుగా మారుస్తామన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును పెడతామన్నారు. వెనకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు 52 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరయ్యాయన్నారు. గురువారం (ఫిబ్రవరి-15) నిజామాబాద్ జిల్లా వర్నీ, మల్లారం గ్రామాల్లో జరిగిన సేవాలల్ మహారాజ్ 279వ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతోందన్నారు.

Posted in Uncategorized

Latest Updates