అన్ని పర్వతాలను అధిరోహించాలన్నదే లక్ష్యం: శివాంగి

అన్ని రంగాల్లో దూస్కెళ్తున్నారు మహిళలు. చదువుతో పాటు అన్ని రకాల ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగానే హరియాణాకు చెందిన 16ఏళ్ల శివాంగి పథక్  ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని మూడు రోజుల్లోనే అధిరోహించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.

గతంలో శివాంగి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది. దీంతో అత్యంత చిన్న వయస్సులోనే ఈ పర్వతాన్ని అధిరోహించిన భారతీయ బాలికగా గుర్తింపు పొందింది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రతి అడుగులో ఎనలేని మద్దతు అందించిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ భూమిపై ఉన్న అన్ని పర్వతాలను అధిరోహించాలన్నదే ఆమె ఏకైక లక్ష్యమని చెబుతోంది శివాంగి.

 

Posted in Uncategorized

Latest Updates