అన్ని వర్గాల్లో పేదలున్నారు: కేటీఆర్

ktrపేదలు అగ్రకులాల్లోనూ చాలా మంది ఉన్నారన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్  తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సీఎం కేసీఆర్ ఏ పని చేసినా చిత్త శుద్ధితో చేస్తారన్నారు మంత్రి కేటీఆర్. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దేశంలో ఇంకా వేలాది గ్రామాలకు కరెంట్ లేదన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు. ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధోగతి పాలు చేసిందన్నారు.  అన్ని వనరులున్నా దేశం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. 1969 ఉద్యమంలో తెలంగాణ ప్రజలను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates