అన్ని వివరాలను పంపిస్తాం : ఎంసెట్ కి మెయిల్‌ ఐడీ తప్పనిసరి

email-id-eamcetఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఎంసెట్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ ఖరారైంది. దీనిపై మంగళవారం (ఫిబ్రవరి-27)న నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఈ క్రమంలో అభ్యర్థులకు ఉన్నత విద్యా మండలి కొన్ని నిబంధనలను సూచించింది.  ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణలో సమస్యలు రాకుండా పక్కా చర్యలు చేపడుతున్నామని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఈసారి దరఖాస్తుకు మెయిల్‌ఐడీ తప్పనిసరి చేశామని, ఏ సమాచారమైనా మెయిల్‌కే పంపిస్తామని వెల్లడించారు.

 

మే 9న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, అదేరోజున ఆన్‌లైన్‌ పరీక్ష జవాబు పత్రం (రెస్పాన్స్‌ షీట్‌) మెయిల్‌ ఐడీకే పంపుతామని చెప్పారు. ఆన్‌లైన్‌ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఐదు జోన్లతోపాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజమాబాద్, వరంగల్, ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. ఈసారి ఆన్‌లైన్‌ పరీక్షల ఉండటంతో ఫీజులు పెంచుతున్నట్లు తెలిపారు పాపిరెడ్డి. పోయిన సంవత్సరం ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా ఉన్న ఫీజు.. ఈసారి రూ.400కు.. బీసీ, జనరల్‌ విద్యార్థులకు రూ.500 నుంచి రూ.800కు పెంచుతున్నట్లు వెల్లడించారు.

 

 

Posted in Uncategorized

Latest Updates