అన్నీ అక్కడే : RSS కార్యక్రమానికి హాజరవడంపై స్పందించిన ప్రణబ్

praఇప్పటికే హాట్ టాపిక్ అయిన ఇష్యూను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. RSS కార్యక్రమానికి హాజరవ్వడంపై ఫస్ట్ టైం స్పందించిన ఆయన.. అన్నింటికి నాగ్ పూర్ లోనే సమాధానమిస్తానని చెప్పారు. ఇప్పటికే ప్రణబ్ తీరుపై కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రణబ్ కామెంట్స్ ఇష్యూను మరింత సీరియస్ గా మార్చాయి.
ఓ బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో… దీనిపై ఇప్పటి వరకు తనకు చాలా ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. వాటికి ఇంతవరకూ తాను స్పందించలేదన్న ఆయన.. అన్నింటికి ఈ నెల ఏడున నాగ్ పూర్ లోనే జవాబు చెబుతానన్నారు. ప్రణబ్ ముఖర్జీ.. ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్తున్నారన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ.. ఆ పార్టీ నేతలు కొందరు మాత్రం వెళ్లడం సరికాదని సూచిస్తున్నారు. సీనియర్ పొలిటీషియన్.. ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి తమ ఐడియాలజీకి వ్యతిరేకమైన సంస్థ కార్యక్రమానికి వెళ్లడంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
RSS మాత్రం ప్రణబ్ పై వస్తున్న విమర్శలను తప్పుపట్టింది. తమను విమర్శించేవారే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు ఆరెస్సెస్ నేత రాకేష్ సిన్హా. సీనియర్ పొలిటీషియన్ అయిన ప్రణబ్ ముఖర్జీకి ఎవ్వరూ స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆయన తన అనుభవాలను పంచుకుంటారని చెప్పారు. ఆయన ఏం చెప్తారనేది ఆయన ఇష్టమని.. ఇందులో ఇతరులకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ వెళ్తున్నారన్న వార్తే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీనికి తోడు.. అన్నింటికి నాగ్ పూర్ లోనే సమాధానం చెబుతానంటూ ప్రణబ్ ముఖర్జీ మాట్లాడటం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates