అన్నీ నేరాలకు…మరణశిక్ష రద్దు చేయనున్న మలేషియా

 మరణ శిక్షను రద్దు చేసిన దేశాల సరసన ఇప్పుడు మలేషియా చేరబోతోంది. ఉరి శిక్షపై దేశీయంగా వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా మలేసియా ప్రభుత్వ మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం(అక్టోబర్-11) కమ్యూనికేషన్‌, మల్టీమీడియా మంత్రి గోబింద్‌ సింగ్‌ డియో తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి చట్టం చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల ఉద్యమకారులు స్వాగతించారు. మరణ శిక్ష ఓ క్రూరమైన, అనాగరికమైన చర్య అని లాయర్స్‌ ఫర్‌ లిబర్టీ రైట్స్‌ గ్రూప్‌నకు సలహాదారు అయిన ఎన్‌ సురేంద్రన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలో ఉరిశిక్ష రద్దైతే.. విదేశాల్లో మలేషియన్లకు మరణశిక్ష విధించే సందర్భాల్లో దాన్ని అడ్డుకునే నైతిక అధికారం ఉంటుందని ఆయన అన్నారు.

హత్య, కిడ్నాప్‌, ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాలు చెలామణీ చేయడం వంటి కొన్ని నేరాలకు ఉరిశిక్ష తప్పనిసరి అనే నిబంధన మలేషియాలో ఉంది.

Posted in Uncategorized

Latest Updates