అన్నీ 500 నోట్లే : జానపద గాయకుడిపై లక్షలు కుమ్మరించారు

GUJARATH

500 నోటు అంటే మనం ఎంత భద్రంగా చూసుకుంటాం.. 500 అప్పు ఇస్తేనే ఎప్పుడు తిరిగి ఇస్తాడో అని ఎదరుచూస్తుంటాం.. ఇస్తాడో ఇవ్వడో అనే టెన్షన్ కూడా.. ఇదంతా సామాన్యులు, మధ్య తరగతి వారి గోల. అదే బాగా డబ్బున్నోళ్లకు అవే నోట్లు కాగితాలతో సమానం. ఎంతలా అంటే.. ఓ జానపద కళాకారుడు పాడిన పాటకు ఫిదా అయ్యి.. లక్షలకు లక్షల రూపాయలు కుమ్మరించాడు. గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి కామన్ అయినా.. ఈసారి మాత్రం వెరీ స్పెషల్ అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అహ్మదాబాద్ లో ఫోక్‌ సింగర్‌ బ్రిజ్ రాజ్ గాద్వి మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు చాలా మంది హాజరయ్యారు. కళాకారులు జానపద పాటలు పాడుతున్నారు. ఈ పాటలకు మైమరిచిపోయిన పలువురు వ్యాపారులు.. 500 నోట్లను కుమ్మరించారు. ప్రోగ్రాం పూర్తయ్యే వరకూ ఇలాగే నోట్ల వర్షం కురిపించారు. ఈ ప్రోగ్రాంకి బీజేపీ నేత జీతూ భాయ్ వఘని హాజరయ్యారు. వెదజల్లిన డబ్బు లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు.

సామాజిక కార్యక్రమాల కోసం చేస్తున్న పని సంతృప్తిని ఇస్తుందన్నారు గాయకుడు బ్రిజ్ రాజ్ గాద్వి. ఫీజు అమౌంట్ కాకుండా.. అదనంగా వచ్చిన డబ్బు మొత్తాన్ని సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. డబ్బులు వెదజల్లడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. గాయకులపై ప్రేమతో ఇలా చేస్తుంటారని సర్ధిచెప్పారు. కళాకారులను ఉత్సాహ పరిచేందుకే ఇలా చేస్తుంటారని తెలిపారు బీజేపీ నేత జీతూ భాయ్.

 

Posted in Uncategorized

Latest Updates