అన్నీ ATM లలో మార్చి 1 నుంచి 200 నోటు

man-shows-new-currency-notes-200-rs_bc09049a-8a37-11e7-b7bc-fa1568cb40f1ఇప్పటివరకూ మెట్రో సిటీల ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉన్న 200, 50 రూపాయల నోట్లు ఇక నుండి అన్నీ ఏటిఎంలలో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 1 నుండి అన్నీ గ్రామీణ ప్రాంతాల ఏటీఎంలలో కూడా ఈ కొత్త నోట్లు లభించనున్నాయి. నోట్ల సైజు ప్రకారం ఏటీఎంలలో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ చేయాల్సి ఉండటంతో కొంత ఆలస్యమైందని, ఇప్పటికే చాలా వరకూ ఈ ప్రక్రియ ముగిసిందని, మార్చి 1 నుండి పూర్తిస్ధాయిలో అందరికీ ఈ కొత్త నోట్లు అందుబాటులోకి వస్తాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. స్ధానిక అవసరాలని బట్టి నోట్లను అమరుస్తున్నారని, పట్టణ ప్రాంతాలలో 2000, 500, 100 రూపాయల నోట్లకు డిమాండ్ ఉందని, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా 50, 100, 200 రూపాయల నోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని ఎస్ బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే తమ సేవలు ఉంటాయని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates