అన్సారి రిలీజ్ : ఆరేళ్ల తర్వాత పాక్ నుంచి ఇండియాకు

గూఢచర్యం కేసులో పాకిస్తాన్ లో బందీ అయిన హమీద్ అన్సారి మంగళవారం విడుదల అయ్యాడు. ముంబై కు చెందిన హమీద్‌ కు ఇంటర్ నెట్ లో పాకిస్తాన్ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారడంతో.. ఆమెను కలుసుకోవడానికి 2012 లో పాస్ పోర్ట్ లేకుండా అఫ్ఘనిస్తాన్ మీదుగా పాక్ కు వెళ్లాడు. దీంతో అక్కడి పోలీసులు గూఢచర్యం కింద అతన్ని అరెస్టు చేశారు. విచారణలో పాస్ పోర్ట్ లేకుండా పాక్ లోకి ప్రవేశించినట్టుగా ఒప్పుకున్నాడు. 2015 లో పాక్ మిలిటరీ కోర్టు హమీద్ కు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. శిక్షాకాలాన్ని పూర్తిచేసుకున్న హమీద్ మంగళవారం విడుదల అయ్యాడు. హమీద్ విడుదలపై అతని తల్లి ఫౌజియా హర్షం వ్యక్తం చేశారు. ఇది మానవత్వ విజయం అని తెలిపారు. హమీద్ గూఢచారి కాదని.. అతని ప్రియురాలు అఫ్ఘనిస్తాన్ మీదుగా రమ్మని పిలిస్తేనే పాకిస్తాన్ వేళ్లాడని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates