అపవిత్ర గోదావరి : బాసరలో నీళ్ల కలర్ మారి జనాలకు రోగాలు

basaraనిర్మల్ జిల్లా బాసర దగ్గర పవిత్ర గోదావరి.. అపవిత్రంగా మారుతోంది. కెమికల్ వ్యర్థాలు కలవడంతో కలుషితంగా మారిపోయింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న కాలుష్యంతో  కలర్ మారి .. జనాలకు రోగాలు తెచ్చిపెడుతోంది.

మహారాష్ట్ర బాబ్లీ గేట్లు ఓపెన్ చేయడంతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. మొన్నటి వరకు ఎండిన గోదారికి జలకళ రావడంతో అటూ అన్నదాతలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. బాసరలో పవిత్ర స్నానాలు చేసి.. పూజించే భక్తులు.. ఇప్పుడు గోదావరిలో స్నానాలు చేయాలంటే భయపడిపోతున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ  నుంచి విషపూరిత రసాయనాలు నదిలోకి వదలడంతో.. కలుషితంగా మారిపోయాయి.

నిర్మల్ జిల్లా బాసరకు 8 కిలో మీటర్ల దూరంలో పయనీర్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఉంది. దీంట్లో ఆల్కహాల్ తయారు చేస్తారు. దీని కోసం వాడిన తర్వాత వచ్చే కెమికల్స్ వ్యర్థాలను ట్యాంకర్లతో బాసర దగ్గర గోదావరి కలిసే దగ్గర వదిలివెళ్తున్నారు. దీంతో పవిత్రంగా చూసుకునే గోదారి కలుషితం అవుతోంది.

బాసర పరిసర ప్రాంతాల్లోని చెరువులను ఈ నీటితోనే నింపుతున్నారు. అటూ ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు తాగేందుకు ఈ నీళ్లనే మళ్లించడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటినే తాగడంతో చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. చర్మ వ్యాధులు, రక్తహీనత, శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర గోదావరి ఇలా అవిత్రంగా మారుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి కాలుష్యంపై  ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు విద్యార్ధులు, భక్తులు. మహారాష్ట్ర సరిహద్దులోని పయనీర్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ వ్యర్ధాలు నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates