అపురూపం : ఉజ్జయినీ మహంకాళి బంగారు బోనం ఇది

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో.. బంగారు బోనం చరిత్రలో నిలిచిపోనుంది. జనరల్ బజార్ లోని ఓ బంగారం షాపులో ప్రత్యేకంగా తయారు చేయించిన.. బంగారు బోనం రెడీ అయ్యింది. 3 కిలోల బంగారంతో ప్రత్యేక ఆకర్షణ రూపుదిద్దుకుంది. 10 మంది స్వర్ణకారులతో ఎలాంటి కెమికల్స్ లేకుండా చేతితో తయారు చేయించారు. బోనం చుట్టూ అమ్మవారి బొమ్మలు ఉన్నాయి. ఆలయంపై ఉన్న చిత్రాలనే బోనం చుట్టూ తీర్చిదిద్దారు. బోనంపై 280 వజ్రాలతో మరింత అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారి బోనం.. దానిపై కలశ చెంబు, దానిపై దీప ప్రతిమ ఉన్నాయి.

జూలై 29, 30 తేదీల్లో జరగనున్న అమ్మవారి బోనాల జాతరలో ఈ బంగారు బోనంతో సమర్పించేందుకు తయారు చేశారు. బోనం తయారీ టెండర్‌ దక్కించుకున్న మా నేపల్లి జువెలర్స్‌.. ఇప్పటికే బోనం తయారీని పూర్తి చేసింది. తుది మెరుగులు దిద్దుతుంది.  అమ్మవారికి చేయించిన బంగారు బోనం ఎంతో అద్భుతంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. రా

Posted in Uncategorized

Latest Updates